logo

సిక్కోలు బిడ్డకు గ్రూప్‌-1 కొలువు

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్‌-1 పరీక్షా ఫలితాల్లో సిక్కోలు బిడ్డ మెరిసింది. తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించింది. పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన యతిరాజుల భవానీ మండల పరిషత్తు డెవలప్‌మెంట్‌ అధికారిగా(ఎంపీడీవో) ఎంపికయ్యారు

Updated : 06 Jul 2022 05:54 IST

పొందూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్‌-1 పరీక్షా ఫలితాల్లో సిక్కోలు బిడ్డ మెరిసింది. తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించింది. పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన యతిరాజుల భవానీ మండల పరిషత్తు డెవలప్‌మెంట్‌ అధికారిగా(ఎంపీడీవో) ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వరహాలరావు, లక్ష్మి దంపతుల కుమార్తె భవాని. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలు మొదటిసారి రాసి ఈ ఘనత సాధించారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు కింతలి ప్రభుత్వ పాఠశాల, ఇంటర్‌ శ్రీకాకుళం, రాజాంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. 2016లో వివాహమైంది. ఈమె భర్త ప్రసాదరావు విశాఖలో ఆర్‌.ఎస్‌.ఐ.గా పనిచేస్తున్నారు. కుమార్తె ఉంది. కుటుంబాన్ని చూసుకుంటూనే పరీక్షలకు సన్నద్ధమైనట్లు ఆమె పేర్కొన్నారు. భవానీకి అయిదుగురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. ఎంపీడీవోగా ఎంపిక కావడంపై గ్రామ సర్పంచి పైడి ప్రసాదరావు, ఎంపీటీసీ సభ్యుడు హనుమంతురావు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు