logo

కనిపించవా దారుణాలు..?

ఈ చిత్రం చూడండి.. ఎంత దారుణమో.. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే అంతర్రాష్ట్ర రహదారిలోనే ఈ దుస్థితి.. సరుబుజ్జిలి మండల కేంద్రంలోనే శిమ్మకోనేరు నుంచి కూడలి వరకు ఇదే పరిస్థితి. చెరువును తలపిస్తున్నా ఎవరికీ పట్టింపులేదు.. గొయ్యి దాటేందుకు బస్సులు సైతం ఇలా ప్రమాదభరితంగా పయనించాల్సి

Published : 10 Aug 2022 04:08 IST

ఈ చిత్రం చూడండి.. ఎంత దారుణమో.. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే అంతర్రాష్ట్ర రహదారిలోనే ఈ దుస్థితి.. సరుబుజ్జిలి మండల కేంద్రంలోనే శిమ్మకోనేరు నుంచి కూడలి వరకు ఇదే పరిస్థితి. చెరువును తలపిస్తున్నా ఎవరికీ పట్టింపులేదు.. గొయ్యి దాటేందుకు బస్సులు సైతం ఇలా ప్రమాదభరితంగా పయనించాల్సి వస్తోంది. రాత్రివేళ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ జేఈ శ్రీనివాసరావు వివరణ కోరగా వెంటనే గొయ్యి పూడ్చివేతకు చర్యలు తీసుకుంటామన్నారు.

- న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని