logo

ఆలయం పునర్నిర్మించాలంటూ దీక్ష

పలాసలో వీరవెంకట సత్యనారాయణ దేవాలయం పునర్నిర్మించేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాశీబుగ్గ వైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజాశ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు.

Published : 04 Dec 2022 06:00 IST

నిరాహార దీక్ష చేస్తున్న రాజాశ్రీకాంత్‌, చిత్రంలో మద్దతుదారులు

పలాస, న్యూస్‌టుడే: పలాసలో వీరవెంకట సత్యనారాయణ దేవాలయం పునర్నిర్మించేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాశీబుగ్గ వైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజాశ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద శనివారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆలయం పడగొట్టి పెట్రోల్‌బంకు నిర్వహిస్తున్నారని, పక్కనే పాఠశాల, కళాశాలలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో దీక్ష ప్రారంభించానని వివరించారు. మద్దతు ఇచ్చేవారంతా తనకు అండగా నిలబడి సంతకాలు చేయాలంటూ కోరారు. కె.జనార్దన, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్థిక స్థితి బాగోలేక అమ్మేశాం: పలాసలో తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవటంతోనే అమ్మేశామని పలాసకు చెందిన తాళాసు రామారావు తెలిపారు. వ్యక్తిగత కక్షతో అదే స్థలంపై దేవాలయం అంటూ ప్రచారం చేస్తున్నారని, తాతముత్తాతల నుంచి సంక్రమించిన స్థలంపై రాద్ధాంతం చేయవద్దని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని