logo

పెండింగ్‌ బిల్లులు అప్‌లోడ్‌ చేయాలి

ఉపాధి పథకంలో భాగంగా  జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను తక్షణమే అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు.

Published : 30 May 2023 04:38 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌, చిత్రంలో ఇతర అధికారులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఉపాధి పథకంలో భాగంగా  జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను తక్షణమే అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత మూడేళ్లుగా సాంకేతిక కారణాలతో చెల్లింపులు కాని బకాయిలతో పాటు ప్రస్తుతం చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.52 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ చేశారని, వాటికి చెల్లింపులు కూడా జరిగాయన్నారు. మరో రూ.15.24 కోట్లు మేర చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. ఇవే కాక ఇంకా బకాయిలు ఏమైనా ఉంటే వాటిని శనివారం లోగా అప్‌లోడ్‌ చేస్తే వాటికి చెల్లింపులు జరుగుతాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జిల్లాలో ప్రారంభమై దాదాపు 9 నెలలు అయిందని, 1,636 పనులకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చామని, వాటిలో 320 పనులు పూర్తయ్యాయని, 90 పనులకు బిల్లులు అప్‌లోడ్‌ చేశారన్నారు. సమావేశంలో సీపీవో వి.ఎస్‌.ఎస్‌.లక్ష్మీప్రసన్న, డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు, జిల్లా పరిషత్తు సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌, వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు, పంచాయతీ రాజ్‌ ఇంజనీరు జయరాం కృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని