logo

రూ.49.36 కోట్లతో కన్యాకుమారి స్టేషను పునరుద్ధరణ

కన్యాకుమారి రైల్వే స్టేషను పునరాభివృద్ధికి దక్షిణ రైల్వే టెంటర్లను ఆహ్వానించింది.

Updated : 25 Nov 2022 01:13 IST

స్టేషను నమూనా

వడపళని, న్యూస్‌టుడే: కన్యాకుమారి రైల్వే స్టేషను పునరాభివృద్ధికి దక్షిణ రైల్వే టెంటర్లను ఆహ్వానించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడానికి రూ.49.36 కోట్లతో పునరాభివృద్ధి పనులు చేపట్టినట్లు దక్షిణ రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. టెండరుకు సంబంధించిన ‘లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌’ (ఎల్‌ఓఏ) బుధవారం అందజేసినట్టు తెలిపారు. ప్రయాణికులు లోపలికి వెళ్లేందుకు, బయటికి వచ్చేందుకు ప్రత్యేక ద్వారాలు, అధునాతన విద్యుద్దీపాలు, అన్ని రకాల వాహనాలు పార్కింగు చేసుకునేందుకు వీలుగా, ప్లాట్‌ఫారాలు చేరుకోవడానికి వీలుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు, కాలినడక పైవంతెనలు నిర్మించనున్నారు. కన్యాకుమారితో పాటు చెన్నై ఎగ్మూరు, కాట్పాడి జంక్షన్‌, మదురై జంక్షన్‌, రామేశ్వరం, కేరళలోని ఎర్నాకులం జంక్షన్‌, ఎర్నాకులం టౌన్‌, కొల్లం, పుదుచ్చేరి, కన్యాకుమారితో కలిపి మొత్తం తొమ్మిది స్టేషన్లను అభివృద్ధి చేయడానికి టెండర్లను అందజేశారు. కుంభకోణం, తిరునెల్వేలి, చెంగనూరు, త్రిసూరు స్టేషన్లను కూడా అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక సమర్పించేందుకు అధ్యయనాలు ప్రారంభించారు. చెన్నై సెంట్రల్‌, తాంబరం, ఆవడి, కోయంబత్తూరు, తిరువనంతపురం సెంట్రల్‌, వర్కాల, కోజికోడ్‌, మంగళూరు స్టేషన్లలో కూడా అధ్యయనాలు చేపట్టారు. ఇవి కాకుండా మరో 38 స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు గుర్తించామని, రైల్వే బోర్డు నుంచి అనుమతి రాగానే టెక్నో ఎకనమిక్‌ ఫీజిబులిటీపై అధ్యయనం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని