logo

సైనికుల త్యాగాలను స్మరించుకోవాలి

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ తరఫున గణతంత్ర దిన వేడుకలు అమరజీవి స్మారక భవన ప్రాంగణంలో గురువారం జరిగాయి.

Published : 27 Jan 2023 00:44 IST

గేయ రచయిత భువనచంద్ర

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ తరఫున గణతంత్ర దిన వేడుకలు అమరజీవి స్మారక భవన ప్రాంగణంలో గురువారం జరిగాయి. ముందుగా పొట్టి శ్రీరాములు  విగ్రహానికి ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత భవన ప్రాంగణంలో ప్రముఖ గేయ రచయిత, కమిటీ సభ్యులు భువనచంద్ర జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ....ఈ ఏడాది జరిగే వేడుకలకు ఓ ప్రత్యేకత ఉందని, సొంత సాంకేతిక పరిజ్ఞానంతో మనదేశ రక్షణ శాఖ తయారుచేసిన ఆయుధాలను దిల్లీలో జరుగుతున్న గణతంత్ర దిన వేడుకల్లో ప్రదర్శించారని కొనియాడారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణత్యాగం చేసిన త్రివిధ దళాల సైనికులను పౌరులందరూ స్మరించుకోవాలన్నారు. కమిటీ కార్యదర్శి, కోశాధికారి కృష్ణారావు, సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ, కమిటీ సభ్యులు డాక్టర్‌ విస్తాలి శంకరరావు, డాక్టర్‌ ఎం.వి.నారాయణ గుప్తా, జేఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని