logo

తమిళనాడు హౌస్‌లో...

దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతిని దిల్లీలోని పొదిగై తమిళనాడు హౌస్‌లో శనివారం నిర్వహించారు.

Published : 04 Jun 2023 01:27 IST

చిత్రపటానికి అంజలి ఘటిస్తున్న ఏకేఎస్‌ విజయన్‌

చెన్నై, న్యూస్‌టుడే: దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతిని దిల్లీలోని పొదిగై తమిళనాడు హౌస్‌లో శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏకేఎస్‌ విజయన్‌ పుష్పాంజలితో నివాళులర్పించారు. తర్వాత ఒడిశా రైళ్ల దుర్ఘటనలోని మృతులకు సంతాపంగా శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో తమిళనాడు హౌస్‌ ప్రిన్సిపల్‌ రెసిడెన్స్‌ కమిషనరు ఆశిష్‌ ఛటర్జీ, అదనపు కమిషనరు చిన్నదురై, అదనపు సంచాలకులు ముత్తయ్య, జనరల్‌ మేనేజరు దైవశిఖామణి, దిల్లీ తమిళ సంఘం అధ్యక్షుడు పెరుమాళ్‌, ప్రధానకార్యదర్శి ముకుందన్‌ తదితరులు పాల్గొన్నారు. ఒడిశా రైళ్ల దుర్ఘటన బాధితుల సహాయార్థం దిల్లీలో హెల్ప్‌ డెస్క్‌ నంబరు 92895 16711, helpdesk.tnhouse@gmail.com అనే ఈ-మెయిల్‌ చిరునామాను వెల్లడించినట్టు ఏకేఎస్‌ విజయన్‌ తెలిపారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటిద్దాం: సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: ట్రాఫిక్‌ నిబంధనలను గౌరవిద్దామంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఆయన చేసిన ట్వీట్‌లో... రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి గాయకుడు అరివరసుతో సంయుక్తంగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా చేపట్టిన ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ట్రాఫిక్‌ పోలీసు నుంచి తప్పించుకోవడానికి కాకుండా ప్రమాదం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ట్రాఫిక్‌ నిబంధనలను పాటిద్దామంటూ హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని