logo

ఆకాశంలో భారీ శబ్దం

తిరువారూర్‌లో మంగళవారం ఉదయం ఆకస్మికంగా పేలుడు శబ్దం వినపడటంతో ప్రజలు భయాందోళన చెందారు.

Published : 27 Mar 2024 00:43 IST

భయాందోళనకు గురైన తిరువారూర్‌వాసులు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తిరువారూర్‌లో మంగళవారం ఉదయం ఆకస్మికంగా పేలుడు శబ్దం వినపడటంతో ప్రజలు భయాందోళన చెందారు. ఉదయం 11 గంటల సమయంలో భారీ పేలుడు శబ్దం రావడంతో ఇళ్లలోనివారు, కార్యాలయాలల్లో పనిచేసేవారు బయటకు పరుగులు తీశారు. ఆ శబ్దం తిరువారూర్‌లోనే కూకుండా పూదోట్టం, మన్నార్‌కుడి, తిరుత్తురైపూండి తదితర ప్రాంతాలతోపాటు పక్కనే ఉన్న కారైక్కాల్‌, నాగపట్నం జిల్లాల్లో కూడా వచ్చినట్లు ప్రజలు చెబుతున్నారు. దీని గురించి పోలీసులు విచారించగా తంజావూర్‌- కొడియక్కరై మధ్య ఆకాశంలో జెట్‌ విమానం నుంచి ఎయిర్‌ రీల్స్‌ చేస్తుండగా భారీ శబ్దం ఏర్పడిందని తెలిసింది. మంగళవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవడంతో పరీక్ష రాస్తున్న విద్యార్థులు శబ్దాలు విని భయంతో పరీక్ష రాయడం ఆపేశారు. కాసేపటి తర్వాత తేరుకుని రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని