logo

నేటితో ప్రచారానికి తెర

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 6 గంటలతో తెర పడనుందని, ఆ తర్వాత అనుమతిలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు తెలిపారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.

Published : 17 Apr 2024 00:55 IST

చెన్నై, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 6 గంటలతో తెర పడనుందని, ఆ తర్వాత అనుమతిలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు తెలిపారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ... తక్కువ సంఖ్యలో ప్రభుత్వ అధికారులు ఉన్న జిల్లాల్లోని పోలింగ్‌ బూత్‌లలో ప్రధాన అధికారి, ఇద్దరు అధికారులను మాత్రం విధుల్లో నియమించడానికి ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చిందన్నారు. ఆ మేరకు చెంగల్పట్టు జిల్లా, విళవంగోడు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలు కారణంగా కన్నియాకుమరి జిల్లాలోని పోలింగ్‌ బూత్‌లలో ఓ ప్రధాన అధికారి, ఇద్దరు అధికారులను విధుల్లో నియమించనున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో అదనంగా ఓ అధికారిని నియమించనున్నట్టు పేర్కొన్నారు. పోలింగ్‌ రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వని ప్రైవేటు సంస్థలపై సంబంధిత జిల్లా ఎస్డీడీ కోడ్‌తో 1950 అనే నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. విక్రవాండి ఎమ్మెల్యే మృతితో ఆ నియోజకవర్గం ఖాళీ అయినట్లు ఎన్నికల కమిషన్‌కు తెలిపామని, ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. జూన్‌ 4లోపు ఉప ఎన్నిక ప్రకటించినా అవసరమైన ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. నియోజకవర్గంతో సంబంధంలేనివారు బుధవారం సాయంత్రం 6 గంటలు తర్వాత ఆ స్థానాన్ని విడిచి వెళ్లిపోవాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని