logo

ఓపీఎస్‌ ఓటు కూడా అన్నాడీఎంకేకే

రామనాథపురంలో ఓపీఎస్‌కు ప్రజాదరణ లేదని, అతని ఓటు కూడా తమ పార్టీకేనని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్‌ తెలిపారు.

Published : 17 Apr 2024 00:57 IST

జయకుమార్‌

సైదాపేట, న్యూస్‌టుడే: రామనాథపురంలో ఓపీఎస్‌కు ప్రజాదరణ లేదని, అతని ఓటు కూడా తమ పార్టీకేనని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్‌ తెలిపారు. పార్టీ ఉత్తర చెన్నై అభ్యర్థి రాయపురం మనోకు మద్దతుగా మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ... జాతీయ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని తెలిపారు. ఎన్నికల తర్వాత ఈపీఎస్‌ నేతృత్వంలోని అన్నాడీఎంకే లేకుండా పోతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. భాజపా అధ్యక్షుడిగా ఓపీఎస్‌, ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ఉంటారని, అన్నామలై కనపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. 2026లో పీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్బుమణి చెప్పటం ఈ శతాబ్దంలోనే ఉత్తమ కామెడీ అని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం, ఒకే దేశం- ఒకే ఎన్నికలు తదితరమైనవి అమలు కానివ్వమన్నారు. భాజపా ఎన్నిసార్లు రోడ్‌షో జరిపినా వారి ఓటు బ్యాంకు పెరగదని చెప్పారు. భాజపా ఎన్నికల మేనిఫెస్టో కాగితపు పూలవంటిదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని