logo

రికార్డు స్థాయిలో వాల్తేర్‌ రైల్వే సరకు రవాణా

తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో సరకు రవాణా చేసినట్లు వాల్తేర్‌ రైల్వే సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

Published : 19 Jan 2022 05:28 IST

విశాఖపట్నం(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో సరకు రవాణా చేసినట్లు వాల్తేర్‌ రైల్వే సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకు 50.11 మిలియన్‌ టన్నులకుపైగా సరకు రవాణా చేసినట్లు వెల్లడించారు. ఇది ఆర్థిక సంవత్సరం కంటే 13.35 శాతం అధికమన్నారు. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి, కొత్తవలస-కిరండూల్‌ మార్గంలో పలు గూడ్స్‌ రైళ్లు ప్రమాదాలకు గురై వ్యాగన్ల కొరత ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో లోడింగ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘనతకు కారణమైన రైల్వే సిబ్బంది, అధికారుల బృందాన్ని వాల్తేర్‌ డీఆర్‌ఎం అనూప్‌ సతపతి అభినందించారు. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ కృషిని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని