logo

జగన్‌ రాజకీయ నియంత

 జగన్‌ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 26 Apr 2024 08:39 IST

సినీనటుడు పృథ్వీరాజ్‌ 

ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్‌

అనకాపల్లి పట్టణం, కొత్తూరు, న్యూస్‌టుడే:  జగన్‌ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం భాజపా ఎన్నికల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ నైజం తెలియక కొన్నాళ్ల పాటు తాను కూడా ఆయనతో ప్రయాణం చేశానన్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలన్నారు. అధికారిక లెక్కల ప్రకారమే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అన్నారు. ఇక అనధికారికంగా ఉన్న ఆస్తులు వెలుగులోకి వస్తే ప్రపంచ స్థాయి కుబేరుడు అని ఆరోపించారు. జగన్‌కు మళ్లీ అవకాశం ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తును ఇబ్బందులు పాల్జేయొద్దని కోరారు.  ఎన్నికలకు ముందు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైకాపా హయాంలో భ్రష్టుపట్టించారన్నారు. ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన ఆయనకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌, అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ  హయాంలో అనకాపల్లి అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భాజపా నాయకులు పరుచూరి భాస్కరరావు, భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు నాయకులు బుద్ధ నాగజగదీశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని