logo

న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్‌ కానిస్టేబుల్‌పై నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

Published : 26 Apr 2024 03:16 IST

కానిస్టేబుల్‌పై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు 

కంటికి దెబ్బతగిలిన తుమ్మా మాధవరెడ్డి

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్‌ కానిస్టేబుల్‌పై నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం విద్యార్థులు కమిషనర్‌ కార్యాలయానికి చేరుకొని రాతపూర్వక ఫిర్యాదు అందించారు. వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బుధవారం ద్వారకా బస్‌స్టేషన్‌ సమీపంలో గణమామ బిర్యానీ కేంద్రంలో తన స్నేహితుడు వివాదంలో ఉన్నాడని తుమ్మా మాధవరెడ్డికి ఫోన్‌ వచ్చింది. కొంతసేపటికి వివాదం జరుగుతున్న ప్రాంతానికి మాధవరెడ్డి అతని మరో స్నేహితుడు జగన్‌తో కలిసి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ద్వారకా పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎన్‌.వెంకటేష్‌ అనే కానిస్టేబుల్‌ మాధవరెడ్డి స్నేహితుడిని జీపులో ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళుతున్నారు. తమ స్నేహితుడిని ఎందుకు తీసుకెళుతున్నారని కానిస్టేబుల్‌ను వారు ప్రశ్నించారు. దీంతో ఏ కారణం లేకుండా కానిస్టేబుల్‌ తనను దూషించి, కంటిపై లాఠీతో గాయపరిచి పోలీసు జీపులో ఎక్కించి తీసుకెళ్లారని మాధవరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద   వేచి ఉన్న ఏయూ న్యాయ కళాశాల విద్యార్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని