logo

ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు.

Published : 26 Apr 2024 03:35 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. అనకాపల్లి నుంచి 30 మంది, నర్సీపట్నం- 22 పాయకరావుపేట- 18, మాడుగుల- 29, చోడవరం- 15, ఎలమంచిలి- 34 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 

అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 18 నుంచి 25 వరకు జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. భాజపా నుంచి సీఎం రమేశ్‌, ఇతనికి డమ్మీగా ఆయన సతీమణి శ్రీదేవి నామినేషన్‌ వేశారు. వైకాపా నుంచి బూడి ముత్యాలనాయుడు, డమ్మీగా బీవీ సత్యవతి, కాంగ్రెస్‌- వేగి వెంకటేష్‌ నామినేషన్లు వేశారు. వీరితో పాటుగా సమాజ్‌వాజ్‌ పార్టీ, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, భారత్‌ యువజన చైతన్య పార్టీ, జై భారత్‌ నేషనల్‌ పార్టీ, దళిత బహుజన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని