logo

పేట వైకాపాకు భారీ షాక్‌

వైకాపాకు భారీ షాక్‌ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్‌పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే.

Published : 26 Apr 2024 03:37 IST

తెదేపాలోకి చేరికలు 

పార్టీలోకి వచ్చిన వైకాపా మద్దతుదారులతో అనిత

పాయకరావుపేట, నక్కపల్లి, న్యూస్‌టుడే: వైకాపాకు భారీ షాక్‌ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్‌పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. తాజాగా వైకాపా నాయకుడు, గోపాలపట్నం ఎంపీటీసీ సభ్యుడు కలిదిండి సతీష్‌రాజు తెదేపాలోకి చేరారు. గోపాలపట్నంకు చెందిన మరో వార్డు సభ్యుడు సహా 200 మందితో కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని వైకాపాకు  చెందిన సుమారు 40 కుటుంబాల వారు కూడా అనిత సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. తనకు సైకిల్‌, ఎంపీ అభ్యర్థి రమేశ్‌కు కమలం గుర్తుపై ఓటేయాలని కోరారు. పార్టీలోకి వచ్చిన వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. సతీష్‌రాజు మాట్లాడుతూ తెదేపా విజయానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తెదేపా పేట మండల శాఖ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు, గూటూరు శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వరరావు, జి.రాజబాబు, జి.దొర, చంద్రమౌళి,  కొప్పిశెట్టి వెంకటేష్‌, కొప్పిశెట్టి కొండబాబు, యలమంచిలి జోగారావు, కోన అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు