logo

50 టన్నుల ‘బల్బీర్‌’ అప్పగింత

హిందుస్థాన్‌ షిప్‌యార్డు నిర్మించిన 50 టన్నుల బొలార్ట్‌ పుల్‌టగ్‌ ‘బల్బీర్‌’ను సోమవారం నౌకాదళ అధికారులకు అప్పగించారు. ముంబయి నేవల్‌ డాక్‌యార్డులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ టగ్‌కు సంబంధించిన ఐఆర్‌ఎస్‌ అధికారిక పత్రాలను షిప్‌యార్డు

Published : 25 Jan 2022 04:50 IST

సింధియా, న్యూస్‌టుడే: హిందుస్థాన్‌ షిప్‌యార్డు నిర్మించిన 50 టన్నుల బొలార్ట్‌ పుల్‌టగ్‌ ‘బల్బీర్‌’ను సోమవారం నౌకాదళ అధికారులకు అప్పగించారు. ముంబయి నేవల్‌ డాక్‌యార్డులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ టగ్‌కు సంబంధించిన ఐఆర్‌ఎస్‌ అధికారిక పత్రాలను షిప్‌యార్డు యాజమాన్యం, భారత నౌకాదళం అధికారులు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. 2019లో కుదిరిన ఒప్పందం ప్రకారం గతేడాది అక్టోబరు, డిసెంబరు నెలల్లో 50 టన్నుల బొలార్డ్‌ పుల్‌ టగ్‌లు ‘వీరన్‌’, ‘బాలరాజ్‌’, ‘బలరాం’లను అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ టగ్‌లు భారత నౌకాదళానికి అనుబంధంగా సహాయక చర్యలు, ఫ్లీట్‌ రివ్యూలో సేవలు అందించనున్నాయని నేవీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని