logo

అద్దె చెల్లించక.. ఆరు బయట వైద్యసేవలు

మండలంలోని దోసూరులో అద్దె భవనంలో నడిసే ఉపకేంద్రానికి ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో మూడు నెలల క్రితం యాజమాని ఖాళీ చేయించారు. దీంతో గ్రామంలోని మర్రిచెట్టు నీడలో ఆరుబయట వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు.

Published : 01 Oct 2022 03:47 IST

దోసూరులో మూడు నెలలగా తప్పని తిప్పలు  

మర్రి చెట్టు నీడలో టీకాలు వేస్తున్న వైద్యసిబ్బంది

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మండలంలోని దోసూరులో అద్దె భవనంలో నడిసే ఉపకేంద్రానికి ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో మూడు నెలల క్రితం యాజమాని ఖాళీ చేయించారు. దీంతో గ్రామంలోని మర్రిచెట్టు నీడలో ఆరుబయట వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఆరుబయట సేవలు పొందడానికి ఇబ్బందిగా భావించే రోజుల్లో అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం స్తంభాలకే పరిమితంకావడం, అద్దె చెల్లించడానికి ప్రభుత్వం డబ్బులు విడుదలచేయకపోవడంతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇలా ఆరుబయట సేవలు పొందుతున్నారు. పేదలు  వైద్యసేవలు పొందడానికి చెట్టే నీడే దిక్కుయిందని ఈ సన్నివేశాన్ని చూస్తున్న వారు మాట్లాడుకుంటున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు