logo

‘ఉక్కు పరిరక్షణకు మరో పోరాటానికి సిద్ధం కావాలి’

భాజపా ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యక్తులు, శక్తులకు దేశాన్ని దోచిపెడుతోందని ఎ.ఐ.టి.యు.సి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ అన్నారు. విశాఖ బీచ్‌రోడ్డులో ఆదివారం స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహించారు.

Published : 03 Oct 2022 03:32 IST

ఉక్కు సత్యాగ్రహ పాదయాత్రలో మాట్లాడుతున్న అమర్‌జిత్‌ కౌర్‌

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : భాజపా ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యక్తులు, శక్తులకు దేశాన్ని దోచిపెడుతోందని ఎ.ఐ.టి.యు.సి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ అన్నారు. విశాఖ బీచ్‌రోడ్డులో ఆదివారం స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అమర్‌జిత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న సంస్థలను ప్రైవేటీకరణ ఎందుకు చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కార్మికుల కృషితో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లాభాల్లో నడుస్తున్నా కావాలనే నష్టాలు వస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ ఆదినారాయణ, చోడవరం శాసనసభ్యులు ధర్మశ్రీ, తెలుగుదేశం నాయకులు శ్రీభరత్‌, సి.పి.ఎం నాయకులు సి.హెచ్‌.నర్సింగారావు, జనసేన నాయకులు అప్పారావు, విశాఖ జిల్లా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షం పడుతున్నా బీచ్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని