logo

కదం తొక్కిన ఒప్పంద కార్మికులు

జీవీఎంసీ ఒప్పంద కార్మికులను శాశ్వత కార్మికులుగా గుర్తించి రూ.28వేల వేతనం అమలు చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Published : 27 Nov 2022 05:04 IST

ర్యాలీ నిర్వహిస్తున్న ఒప్పంద కార్మికులు

డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: జీవీఎంసీ ఒప్పంద కార్మికులను శాశ్వత కార్మికులుగా గుర్తించి రూ.28వేల వేతనం అమలు చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో సరస్వతి పార్కు నుంచి ఆర్టీసీ కాంప్లెక్సు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లుగా మార్చి యజమానుల పక్షాన నిలిచాయన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెట్టేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, కార్యదర్శి పి.మణి, నాయకులు జి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని