logo

రైతులను నిలువునా ముంచిన వైకాపా

కష్టాల్లో చిక్కుకున్న రైతన్నను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారిని నిలువునా ముంచారని అనకాపల్లి జిల్లా తెదేపా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

Published : 05 Jun 2023 03:51 IST

జిల్లా తెదేపా అధ్యక్షుడు నాగజగదీశ్వరరావు

దుక్కి దున్నుతున్న నాగజగదీశ్వరరావు, తెదేపా నాయకులు

రావికమతం, న్యూస్‌టుడే: కష్టాల్లో చిక్కుకున్న రైతన్నను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారిని నిలువునా ముంచారని అనకాపల్లి జిల్లా తెదేపా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు ఆరోపించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆదివారం గుమ్మళ్లపాడులో తెదేపా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబు, బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌రాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాగలి పట్టి దుక్కిదున్నారు. అనంతరం నిర్వహించిన సభలో నాగజదగీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో రెవెన్యూ లోటు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు రూ. 50 వేలు రుణమాఫీ చేసిన ఘనత చంద్ర
బాబుదని చెప్పారు. ‘రైతు భరోసా’ పథకం కింద ఏడాదికి రూ. 12 వేలు ఇస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చాక కేంద్ర సాయం రూ. 6 వేలతో కలిపి రూ. 18 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ. 7500 మాత్రమే ఇస్తూ అన్నదాతలను మోసం చేస్తున్నారన్నారు. నాలుగేళ్ల పాలనలో విద్యుత్తు ఛార్జీలను తొమ్మిదిసార్లు పెంచిన ఘనత జగన్‌దేనన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టో వైకాపాలో వణుకు పుట్టిస్తోందన్నారు. తాతయ్యబాబు మాట్లాడుతూ పూర్తిస్థాయి మేనిఫెస్టోలో అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా మరిన్ని సంక్షేమ పథకాలు ఉంటాయన్నారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెదేపా మండలాధ్యక్షుడు రాజాన కొండనాయుడు, నియోజవకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు కాళింగ తాతలు, నాయకులు శంకరరావు, సత్యారావు, మోదినాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని