logo

పాలిసెట్‌లో అదరగొట్టిన విశాఖ బాలిక

జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఆశించిన లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పోతుల జ్ఞానహర్షిత పాలిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది.

Published : 09 May 2024 04:20 IST

రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం

కొమ్మాది, న్యూస్‌టుడే: జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఆశించిన లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పోతుల జ్ఞానహర్షిత పాలిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. విశాఖ నగర పరిధి కొమ్మాది అన్నంరాజునగర్‌ ప్రాంతానికి చెందిన ఈమె తండ్రి అప్పలనాయుడు బోయపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా, తల్లి ప్రగతి చోడవరం నీటి పారుదలశాఖలో డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన పాలిసెట్‌లో జ్ఞానహర్షిత 120 మార్కులకు గాను 120 మార్కులు తెచ్చుకొని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ప్రతిభ చాటింది. ఈమె స్థానికంగా ఓ ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. ఈ పరీక్ష కోసం తాను ప్రత్యేకంగా ఏ రోజూ చదవలేదని, ఉపాధ్యాయులు బోధించినపుడే అన్ని పాఠ్యాంశాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకున్నందున, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల తనకు ఈ విజయం లభించిందని ఆమె పేర్కొంది. తన భవిష్యత్తుకు ఇది తొలి అడుగు అని, ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువుల్లోనూ ముందుకు సాగుతానని, తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరుస్తానని తెలిపింది. మంచి కళాశాలలో ప్రవేశం పొంది ఉన్నత విద్యలోనూ ప్రతిభ చాటడం ద్వారా ఐఐటీ చేయాలనేది తన లక్ష్యమని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని