logo

ఓటు వివరాలు ముందే తెలుసుకోండిలా!

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈనెల 13న జిల్లాలోని ఒక లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Published : 10 May 2024 04:26 IST

ఇంటికి ఓటరు స్లిప్‌ రాకున్నా కంగారుపడొద్దు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈనెల 13న జిల్లాలోని ఒక లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం గతంలో విడుదల చేసిన జాబితాలో అనేక లోపాలు వెలుగుచూశాయి. చాలా మందికి ఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉంది? ఎలా చేరుకోవాలనే సందేహాలు ఓటర్లలో తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్డు, పోలింగ్‌ కేంద్రం, వరుస సంఖ్య వివరాలు తెలుసుకుంటే ఎన్నికల రోజున సకాలంలో పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం బీఎల్‌వోలు ఇంటింటికీ ఓటు వివరాల స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారు. అవి అందకున్నా కంగారు పడనవసరం లేదు. వివరాలు తెలుసుకొని ఆధార్‌, పాన్‌, ఓటరు కార్డు, ఇంకా..అధికారులు పేర్కొన్న ధ్రువీకరణలతో పోలింగ్‌కు వెళ్లొచ్చు.


 

 

ఓటర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు విశాఖ కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశారు. 0891-2590100 నంబర్‌కు ఫోన్‌ చేసి ఓటరు పేరు, నియోజకవర్గం, ఓటరు కార్డు సంఖ్య (ఎపిక్‌ నెంబర్‌) చెబితే ఓటరు జాబితాలో వరుస సంఖ్య, పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలియజేస్తారు. ఈ కాల్‌ సెంటర్‌ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.


చరవాణిలో ‘ఈసీఐ’ అని ఆంగ్లంలో టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మీ ఎపిక్‌ నంబరు నమోదు చేసి 1950 నంబరుకు ఎస్‌ఎంఎస్‌ పంపాలి. కొద్ది సమయంలో మీ పేరు, బూత్‌ నంబరు, జాబితాలో వరుస సంఖ్య వివరాలతో సంక్షిప్త సమాచారం వస్తుంది.


‘ఓటరు హెల్ప్‌లైన్‌’ యాప్‌, వెబ్‌సైట్‌లోనూ ఫోన్‌ నంబర్‌, ఎపిక్‌ నంబరుతో ఈ వివరాలను తెలుసుకోవచ్చు. వాటిలో ‘సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ రోల్‌’ అన్న చోట మీటగానే నాలుగు విభాగాలు వస్తాయి. మీ ఓటుకు ఫోను నంబరు అనుసంధానమై ఉంటే ‘సెర్చ్‌ బై మొబైల్‌’ అని ఉన్న చోట మీటితే.. కోరిన వివరాలు నమోదు చేసి ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. ‘ఎపిక్‌ నంబర్‌’ అనే చోట నంబర్‌, రాష్ట్రం నమోదు చేసినా వివరాలు వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని