logo

ఇన్‌ఛార్జి జిల్లా జడ్జిగా సురేశ్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తిగా మొదటి అదనపు జిల్లా జడ్జి బి.సురేశ్‌ వ్యవహరించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగ్‌రావు

Published : 21 May 2022 01:50 IST

వరంగల్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తిగా మొదటి అదనపు జిల్లా జడ్జి బి.సురేశ్‌ వ్యవహరించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగ్‌రావు బదిలీపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా వెళ్తుండటంతో న్యాయమూర్తి సురేశ్‌కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఇన్‌ఛార్జిగా కొనసాగనున్నారు.

మరిచిపోలేని జ్ఞాపకాలు: ఓరుగల్లును మరువలేను..ఇక్కడి న్యాయవాదులను అసలే మరువను అంటూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగ్‌రావు అన్నారు. రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా బదిలీ పై వెళ్లున్న సందర్బంగా ఆయనకు జిల్లా బార్‌ అసోసియేషన్‌ హాల్లో శుక్రవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. నర్సింగ్‌రావును గజమాలతో సత్కరించారు. శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి న్యాయవాదులు తమ అభిమానం చాటుకున్నారు. కార్యక్రమంలో జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆనందమోహన్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు జయాకర్‌, డాక్టర్‌ సంజీవరావు, జనార్దన్‌, సీనియర్‌, జూనియర్‌, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయంలో మోకిల సత్యనారాయణ ఆధ్యర్యంలో నర్సింగ్‌రావును ఘనంగా సత్కరించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి బి.సురేశ్‌, ప్రాసిక్యూటర్లు భద్రాద్రి, రంజిత్‌, శ్రీనివాసరావు, సత్యనారాయణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని