logo

అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండలంలోని దేవానగర్, ముద్దునురి తండాలలో పార్టీ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి ఆధ్వర్యంలో

Published : 22 May 2022 03:10 IST

ములుగు రూరల్, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండలంలోని దేవానగర్, ముద్దునురి తండాలలో పార్టీ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం రైతు డిక్లరేషన్‌ రచ్చబండ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తామని, పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు యాజమాన్య హక్కు కల్పించి ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని అన్నారు. కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్‌ గౌడ్, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బానోత్‌ రవిచందర్, నాయకులు చాంద్‌పాషా, బొక్క సత్తిరెడ్డి, రామకృష్ణ, రవీందర్, శ్యామ్, తిరుపతి, భద్రయ్య, జయపాల్‌రెడ్డి, భిక్షపతి, ఐలయ్య, సాంబయ్య, లత, రాములు, రంగమ్మ పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని