logo
Published : 28 Jun 2022 06:16 IST

తెలంగాణ రాష్ట్రం కళలకు నిలయం


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

మొగుళ్లపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం కళలకు నిలయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తెరాస జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. సోమవారం ముల్కలపల్లి, మొగుళ్లపల్లి గ్రామాల మధ్యలో చిన్న మేడారం జాతర జరిగే ఆవరణలో జీఎంఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన మండల స్థాయి కోలాటం పోటీలను తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన అనేక మంది కవులను, కళాకారులను, గాయకులను ప్రభుత్వం గౌరవించిందన్నారు. మహిళల్లో ఉండే కళను వెలికి తీసేందుకే జీ ఎం ఆర్‌ ట్రస్ట్‌ పోటీల్లో పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ శోభ, మున్సిపల్‌ ఛైర్మన్‌ వెంకటరాణి, కౌన్సిలర్లు, ఎంపీపీ యార సుజాత, జడ్పీటీసీ సభ్యుడు జోరుక సదయ్య, వైస్‌ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, స్థానిక సర్పంచి ధర్మారావు, తెరాస మండల అధ్యక్షుడు తిరుపతిరావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని