logo

నయనానందకరం.. సహస్ర కలశాభిషేకం

శ్రీభద్రకాళి అమ్మవారి సహస్ర కలశాభిషేకం నయనానందకరంగా సాగింది. వేయి కలశాలతో అమ్మవారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలు, గంధం,

Published : 01 Jul 2022 01:55 IST

రంగంపేట, న్యూస్‌టుడే: శ్రీభద్రకాళి అమ్మవారి సహస్ర కలశాభిషేకం నయనానందకరంగా సాగింది. వేయి కలశాలతో అమ్మవారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలు, గంధం, చందనం, విభూది, కుంకుమ, ధాన్యాలు, తైలాలు, కాషాయాలు, దేశంలోని వివిధ పుణ్యనదీ జలాలతో సహస్ర కలశాభిషేకం కనుల పండువగా జరిగింది. గురువారం తెల్లవారు జామున  శాకాంబరీ నవరాత్ర యాగాన్ని నిర్వహించారు. ఉదయం కాళిగా, సాయంత్రం కామేశ్వరిగా అలంకరించి పూజారాధనలు జరిపారు. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ దంపతులు జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. మేయర్‌ గుండు సుధారాణి అమ్మవారిని దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు