logo

అంబరాన్నంటిన ఆదివాసీ సంబరం

ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలు, వివిధ ఆదివాసీ ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వైజంక్షన్‌ నుంచి

Published : 10 Aug 2022 04:21 IST


మాట్లాడుతున్న పీవో అంకిత్‌, చిత్రంలో గిరిజన నాయకులు

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలు, వివిధ ఆదివాసీ ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వైజంక్షన్‌ నుంచి బయలుదేరి నాయకపోడుల ఆరాధ్య దైవాలైన లక్ష్మీదేవరతో, మేళ తాళాలతో ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐటీడీఏ పీవో అంకిత్‌ హాజరయ్యారు. పీసా కోఆర్డినేటర్‌ కొమరం ప్రభాకర్‌ అధ్యక్షతన కుమురం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల జెండాను తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రజా సంఘాల ప్రతినిధి పొడెం రత్నం మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు అమలయ్యేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పోడు భూములపై అటవీ అధికారుల దాడులు ఆపాలన్నారు. సర్పంచి రామ్మూర్తి, ఏపీవో వసంతరావు, వివిధ సంఘాల నాయకులు కృష్ణప్రసాద్‌, రాంబాబు, ధర్మయ్య, రవి, సంతోష్‌, రవి, ఆరజు, మహేష్‌, నర్సయ్య, లక్ష్మీకాంత, సులోచన, చంద్రకళ, కోటయ్య, సారయ్య తదితర రెండు వందల మంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని