logo

‘వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం’

ప్రజా ధనాన్ని ప్రధాని మోదీ కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Published : 05 Feb 2023 06:11 IST

ప్రసంగిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ఎల్కతుర్తి, న్యూస్‌టుడే: ప్రజా ధనాన్ని ప్రధాని మోదీ కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం ఎల్కతుర్తిలో జరుగుతున్న సీపీఐ జిల్లా స్థాయి శాఖ కార్యదర్శుల శిక్షణ తరగతులు మండల కార్యదర్శి వి.రాములు అధ్యక్షతన జరిగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం చేశారన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కార్పొరేట్‌ రంగానికి ప్రజా సొమ్మును షేర్ల రూపంతో పెట్టి నష్టం జరగటానికి కారణమయ్యాడని ఆరోపించారు. మార్చి 17 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పాదయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సారయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్‌, నాయకులు కర్రె లక్ష్మణ్‌, నిమ్మల మనోహర్‌, సంజీవ్‌, శ్రీనివాస్‌, పలు మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని