logo

అనుమతి లేని వెంచర్లపై అధికారుల కన్నెర్ర

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై పురపాలక సంఘం పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు.

Published : 07 Feb 2023 06:04 IST

కలెక్టరేట్‌ రోడ్‌లోని ఓ వెంచరులో అంతర్గత రహదారులను తొలగిస్తూ..

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా కొందరు స్థిరాస్తి వ్యాపారులు ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై పురపాలక సంఘం పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. ‘అక్రమ వెంచర్లు.. కొనుగోలుదారులకు అవస్థలు’  శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మరిపెడ రోడ్‌లోని ఈవీఎం గోదాం, రజాలిపేట రోడ్‌లో కంబాలచెరువు, తొర్రూరు రోడ్‌లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం సమీపంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన వెంచర్లలో నిర్మించిన అంతర్గత రహదారులను యంత్రాలతో ధ్వంసం చేశారు. ఆ ప్రాంతాల్లో బోర్డులను ప్రదర్శించారు. పట్టణ ప్రణాళికా విభాగం అధికారి నవీన్‌ మాట్లాడుతూ అనుమతులు లేకుండా వెంచర్లు చేసిన స్థిరాస్తి వ్యాపారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. నిబంధనలకు అతిక్రమిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. లే-అవుట్‌ అనుమతి దరఖాస్తు చేసుకుంటే అన్ని దరఖాస్తులను పరిశీలించి నిర్ధేశించిన సమయంలో అనుమతులు ఇస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన వివరించారు. సూపర్‌వైజర్‌ ప్రవీణ్‌బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

రజాలిపేట రోడ్‌లో ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని