logo

‘నైతిక బాధ్యత వహించి సీఎం రాజీనామ చేయాలి’

గ్రూప్‌1 పేపర్ల లీకేజికి నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేయాలని హుజురాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 01 Apr 2023 04:11 IST

ధర్మారంలో జిల్లా భాజాపా కార్యాలయానికి ప్రారంభిస్తున్న హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

గీసుకొండ, న్యూస్‌టుడే: గ్రూప్‌1 పేపర్ల లీకేజికి నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేయాలని హుజురాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని వరంగల్‌, మహబూబాబాద్‌, భూపాలపల్లి, జనగాం, సంగారెడ్డి జిల్లాలో భాజాపా నూతన కార్యాలయాలను నిర్మించగా శుక్రవారం భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌ పద్దతిలో వాటిని ప్రారంభించారు.రూ.2.50 కోట్లతో నిర్మించిన వరంగల్‌ జిల్లా కార్యాలయాన్ని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రారంభించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాబోయే ఎన్నికల్లో భాజాపాను గెలిపిస్తే నీతిమంతమైన పాలనను అందిస్తామని ఈటల హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాజాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాడగాని శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని