logo

ముగిసిన బ్రహ్మోత్సవాలు

మండలంలోని కొడవటంచలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి నాకబలి (పుష్పయాగం) కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది.

Published : 28 Mar 2024 03:55 IST

రేగొండ, న్యూస్‌టుడే: మండలంలోని కొడవటంచలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి నాకబలి (పుష్పయాగం) కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు బుచ్చమాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామి ఉత్సవ విగ్రహాలను హంస వాహనంపై డప్పుచప్పుళ్లతో మాఢ వీధుల్లో ఊరేగించారు. భక్తుల సంకీర్తనల మధ్య కల్యాణ మండపంలో అమ్మవారితో స్వామివారికి నాకబలి (పుష్పయాగం) (నాగబెల్లి) కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ప్రకటించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకొని మొక్కులు, కానుకలు చెల్లించుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిట్యాల సీఐ మల్లేశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఛైర్మన్‌ భిక్షపతి, ఈవో శ్రీనివాస్‌, ఆలయ కమిటీ సభ్యులు కోటి, శ్రీధర్‌, దశరథం, సంపత్‌, తిరుపతి, శ్రీనివాస్‌,లక్ష్మి, సమ్మయ్య, గ్రామ పెద్దలు రవీందర్‌, శ్రావణ్‌, సుధాకర్‌, కర్ణాకర్‌రెడ్డి, సంపత్‌రావు పాల్గొన్నారు.

స్వామివారికి మొక్కులు సమర్పించుకున్న ఎమ్మెల్యే

స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, గణపురం జడ్పీటీసీ సభ్యురాలు గండ్ర పద్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి మొక్కులు, కానుకలు సమర్పించుకున్నారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పూజలు చేశారు. ఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థల ఛైర్మన్‌ సంపత్‌రావు, నేతలు పాపిరెడ్డి, రాజేందర్‌, అశోక్‌, రాజిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని