logo

స్తంభాన్ని సరిచేశారు..

ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులోని వరి చేనులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని అధికారులు సరిచేశారు.

Published : 28 Mar 2024 04:13 IST

న్యూస్‌టుడే, వరంగల్‌ వ్యవసాయం

నవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులోని వరి చేనులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని అధికారులు సరిచేశారు. ‘ఒరిగిన స్తంభం.. ప్రాణాలకే ప్రమాదం’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురించిన చిత్ర వార్తకు విద్యుత్తు అధికారులు స్పందించారు. సిబ్బందితో వెళ్లి పక్కనే ఉన్న ఈతచెట్టును తొలగించి, స్తంభాన్ని సరిచేశారు. వేలాడుతున్న తీగలను బిగించారు.


డివైడర్‌ మధ్య కొమ్మల తొలగింపు

హనుమకొండ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ కూడలి నుంచి కాకతీయ విశ్వవిద్యాలయం జంక్షన్‌ వరకు రోడ్డు మధ్యలో డివైడర్లలో ఏపుగా పెరిగిన మొక్కల కొమ్మలను తొలగించారు. ఇనుప డివైడర్ల మధ్య నాటిన పూల మొక్కల సంరక్షణను నగర పాలక సిబ్బంది విస్మరించడంతో అవి పెరిగి రోడ్డుపైకి కొమ్మలు రావడంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై ‘ఆహ్లాదం మాటున ముప్పు’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురించిన చిత్ర వార్తకు గ్రేటర్‌ వరంగల్‌ అధికారులు స్పందించారు. సిబ్బంది ద్వారా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించి, మొక్కలను చూడచక్కగా మార్చారు.

న్యూస్‌టుడే, నయీంనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని