logo

ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు.

Updated : 10 May 2024 05:51 IST

మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి కావ్య

నయీంనగర్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు. గురువారం హనుమకొండలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కడియం ఫౌండేషన్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. రాజకీయ గురువు, తన తండ్రి శ్రీహరి ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. పుట్టింది పెరిగింది ఇక్కడేనంటూ ఉన్నత విద్యను అభ్యసించానని, ఉమ్మడి జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ మ్యానిఫెస్టో రూపొందించిందన్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా ఓరుగల్లును విద్య, వైద్య, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని, జిల్లా అభివృద్ధిలో తనదంటూ ఒక ప్రత్యేకత చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, కోశాధికారి అమర్‌, జర్నలిస్టు సంఘాల బాధ్యులు బీఆర్‌ లెనిన్‌, మెండు రవీందర్‌, వివిధ ఛానళ్ల ప్రతినిధులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

ప్రజల గొంతుకనై ప్రశ్నిస్తా:  కాజీపేట రూరల్‌, మడికొండ:  వరంగల్‌ అభివృద్ధికి పార్లమెంట్లో ప్రజల గొంతుకనై ప్రశ్నించి రావాల్సిన నిధులు తీసుకొస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. కాజీపేట మండలం కడిపికొండ, రాంపేట గ్రామాల్లో గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజుతో కలిసి కావ్య కార్నర్‌ సమావేశంలో ప్రసంగించారు. అంతకుముందు మంగళ హారతులతో స్వాగతం పలికి గొర్రెపిల్ల, గొంగళి అందజేసి మహిళలు మద్దతు పలికారు. కాషాయం కండువా కప్పుకుని వస్తున్న భూబకాసురుడు అరూరి రమేశ్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ మహ్మద్‌ రియాజ్‌, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. కావ్యను గెలిపించాలని ఎమ్మెల్యే నాగరాజు గురువారం మడికొండలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.  

ధర్మసాగర్‌, వేలేరు: భారాస, కేసీఆర్‌ కుటుంబం అవినీతి అక్రమాల్లో కూరుకుపోవడం వల్ల, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి వచ్చానని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే  శ్రీహరి ధర్మసాగర్‌, వేలేరు మండలాల్లో  గురువారం రాత్రి కార్నర్‌ సమావేశాలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై కడియం శ్రీహరి నిప్పులు కక్కారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని