logo

చేతులెత్తి మొక్కినా కనికరించ లేదు

‘తన భర్త మృతి చెందగా సకాలంలో మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో బీమా వర్తించదని అంటున్నారు. నాకు ఏ ఆధారం లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చేతులెత్తి మొక్కి అడిగినా సచివాలయ ఉద్యోగులు

Published : 13 Aug 2022 06:18 IST

భర్త చనిపోతే బీమా వర్తించదంటున్నారు
కన్నీటి పర్యంతమైన మహిళ

నరసింహరాజుతో  ఆవేదన వ్యక్తం చేస్తున్న కరుణ

ఆకివీడు, న్యూస్‌టుడే: ‘తన భర్త మృతి చెందగా సకాలంలో మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో బీమా వర్తించదని అంటున్నారు. నాకు ఏ ఆధారం లేదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చేతులెత్తి మొక్కి అడిగినా సచివాలయ ఉద్యోగులు కనికరించలేదు’ అని గుమ్ములూరు గ్రామానికి చెందిన బొమ్మి కరుణ వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు వద్ద తన గోడు చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. గుమ్ములూరు పరిధిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నరసింహరాజు ఆమె ఆవేదన చూసి సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారులు, తాగునీరు, డ్రెయినేజీ సమస్యలు పరిష్కరించాలని వార్డు సభ్యురాలు సంగాని కనకలక్ష్మి నరసింహరాజుకు వినతి పత్రం అందజేశారు. పిట్లా పాపమ్మ తనకు ఫింఛన్‌ మంజూరు కాలేదని, మరికొందరు పలు సమస్యలను వైకాపా నాయకులకు వివరించారు. సచివాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని