logo

అలసిపోయాం.. మా బాధలు తీర్చండి

అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయాం.. మా బాధలు ఆలకించి తీర్చండి.. అంటూ పలువురు వేడుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ‘స్పందన’ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యల్ని ఏకరవు పెట్టారు.

Published : 06 Jun 2023 04:28 IST

‘స్పందన’లో  అర్జీదారుల వేడుకోలు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయాం.. మా బాధలు ఆలకించి తీర్చండి.. అంటూ పలువురు వేడుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ‘స్పందన’ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యల్ని ఏకరవు పెట్టారు.

236 అర్జీలు

వినతులు స్వీకరిస్తున్న డీఆర్వో సత్యనారాయణమూర్తి

ప్రజల సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయి ‘స్పందన’ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. డీఆర్వో సత్యనారాయణమూర్తి, జడ్పీ సీఈవో రవికుమార్‌ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌరసరఫరాలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, పింఛన్లు, సర్వే, భూవివాదాలకు సంబంధించి 236 అర్జీలు అందాయి. ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని డీఆర్వో తెలిపారు.

వృద్ధురాలినైనా కనికరం చూపలేదు

నా పేరు యర్రా సావిత్రమ్మ. దెందులూరు మండలం పోతునూరు. కైకలూరు పరిధిలోని రామవరంలో నా భర్త శ్రీరాములు పేరున 59 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఆయన మరణించి రెండేళ్లు దాటింది. ఆయన బతికున్నప్పుడు భూమిని లీజుకిచ్చారు. లీజుదారులు సక్రమంగానే సొమ్ము చెల్లించేవారు. ఆయన మరణించినప్పటి నుంచి లీజు ఇవ్వకపోగా భూమిని ఆక్రమించేసుకున్నారు. నాకు జరిగిన అన్యాయం గురించి తహసీల్దారుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పలుమార్లు ప్రశ్నిస్తే భూమి వేరొకరి పేరున ఉందని చెబుతున్నారు. నాకు తగిన న్యాయం చేయగలరు.

కళాకారులకు ఇచ్చే గౌరవమిదేనా?

‘కళనే జీవనాధారంగా బతుకుతున్న మేము 2018 ఆగస్టు నుంచి 2019 జనవరి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మండలాల వారీగా కళారూపాలు ప్రదర్శించాం. అందుకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కళాకారులకు దాదాపు రూ.84 లక్షలు రావాల్సి ఉంది. ఆ సొమ్ము చెల్లించాలంటూ నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా ఫలితం లేదు’ అని జానపద కళాబృంద నాయకుడు టి.భాస్కరరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని