logo

విద్యార్థుల జీవితాలతోచెలగాటమాడొద్దు : ఎమ్మెల్సీ

రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండగా.. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు, అహంకార పూరిత ధోరణితో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఎమ్మెల్సీ, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

Published : 21 Jan 2022 05:20 IST

ఉండి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండగా.. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు, అహంకార పూరిత ధోరణితో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఎమ్మెల్సీ, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మంతెన వెంకట సత్యనారాయణరాజు ఆరోపించారు. పాందువ్వలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో పాఠశాలలకు అక్కడి ప్రభుత్వాలు సెలవులు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు తాడేపల్లి ప్యాలెస్‌ దాటి బయటకు వెళ్లరని, విద్యార్థులు కొన్ని కిలోమీటర్లు ఆటోలు, బస్సుల్లో ప్రయాణిస్తూ పాఠశాలలకు రావాల్సిన పరిస్థితులు నెలకొనడం దారుణమన్నారు. ఏ ఆసుపత్రిలోనూ కరోనా రోగులకు సరిపడేంత మందులు, పడకలు, ఆక్సిజన్‌ వంటి సౌకర్యాలు లేవని ఆరోపించారు. కరోనా బారిన పడిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చికిత్స పొందుతుండటం శోచనీయమన్నారు. మూడో దశలో వ్యాప్తి అధికంగా ఉండటంతో విద్యార్థులకు కరోనా సోకే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని వాపోయారు. రాష్ట్రంలో సెలవులు ఇవ్వకపోవడానికి విద్యా శాఖా మంత్రికి చెందిన విద్యాసంస్థలకు నష్టం వస్తుందని ఆలోచిస్తున్నారా..? అని ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా..? విద్యా వ్యాపారాలు ముఖ్యమా.. అని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని