logo

యువత రక్తదానం

ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో 148 మంది యువతీయువకులు రక్తదానం చేసినట్లు సీబీఐటీ కళాశాల ఛైర్మన్‌ జయచంద్రారెడ్డి తెలిపారు.

Published : 29 Mar 2023 03:54 IST

రక్తదానం చేస్తున్న యువకులు

చాపాడు, న్యూస్‌టుడే: ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో 148 మంది యువతీయువకులు రక్తదానం చేసినట్లు సీబీఐటీ కళాశాల ఛైర్మన్‌ జయచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం కళాశాలలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు కవిత సమక్షంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తం చాలా అవసరమని గుర్తించిన ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు స్వచ్చందంగా రక్తదానం చేసినట్లు దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టరు లోహిత్‌రెడ్డి చెప్పారు. ప్రిన్సిపల్‌ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని