logo

అనర్హులకు మూల్యంకన విధులపై విచారణ

‘సస్పెండైనవారు... పది జవాబుపత్రాలు దిద్దుతారంట’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పదోతరగతి పరీక్షల జిల్లా పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి స్పందించారు.

Published : 28 Mar 2024 03:48 IST

కడప విద్య, న్యూస్‌టుడే : ‘సస్పెండైనవారు... పది జవాబుపత్రాలు దిద్దుతారంట’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పదోతరగతి పరీక్షల జిల్లా పరిశీలకులు వెంకటకృష్ణారెడ్డి స్పందించారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి వెళ్లి అనర్హులకు విధులు కేటాయింపుపై డీఈవో అనురాధ, కార్యాలయ ఉద్యోగులతో సమావేశమయ్యారు. సస్పెండైనవారికి, సబ్జెక్టు బోధించని వారికి జాబితాలో చోటు కల్పించడంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. అర్హులైన వారిని మాత్రమే నియమించాలని చెప్పారు.  

మూల్యాంకన విధుల కేటాయింపులో తప్పులను సరిచేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం మహేష్‌బాబు డిమాండ్‌చేశారు. దీనిపై స్థానిక పాఠశాల విద్య కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) కార్యాలయంలో సూపరింటెండెంట్‌ బాబునాయక్‌కు వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని