logo

Telangana News: మెదక్‌లో ఆర్టీసీ అద్దె బస్సు చోరీ.. బాచుపల్లిలో ప్రత్యక్షం

గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ అద్దె బస్సును చోరీ చేయగా.. 24 గంటల తర్వాత హైదరాబాద్‌లోని బాచుపల్లి సమీపంలో ప్రత్యక్షమైంది. బస్సు డ్రైవర్‌ తెలిపిన వివరాలు.. టీఎస్‌ 36టీ 7364 నెంబరు గల బస్సును

Updated : 04 Feb 2022 08:32 IST

అగంతుకుడు వదిలేసిన బస్సు

మెదక్‌, న్యూస్‌టుడే: గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ అద్దె బస్సును చోరీ చేయగా.. 24 గంటల తర్వాత హైదరాబాద్‌లోని బాచుపల్లి సమీపంలో ప్రత్యక్షమైంది. బస్సు డ్రైవర్‌ తెలిపిన వివరాలు.. టీఎస్‌ 36టీ 7364 నెంబరు గల బస్సును ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన మెదక్‌-హైదరాబాద్‌ వయా నర్సాపూర్‌ మార్గంలో నడుపుతోంది. ఈ క్రమంలో వాహనం డ్రైవరు కన్నెబోయిన దుర్గారాములు మంగళవారం రాత్రి బస్సును స్థానిక వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయం పక్కన ఉన్న ప్రైవేటు బస్సులు నిలిపే స్థలంలో పార్కింగ్‌ చేశాడు. మరో డ్రైవరు సత్యనారాయణ అదే రోజు రాత్రి 12 గంటల వరకు బస్సుకు మరమ్మతులు చేసి నిద్రకు ఉపక్రమించారు. బుధవారం ఉదయం దుర్గారాములు వచ్చి చూసే సరికి బస్సు కనిపించకపోవడంతో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేయగా, ఈ మేరకు పట్టణ సీఐ మధు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం హైదరాబాద్‌లోని బాచుపల్లి-మల్లంపేట మార్గంలో రహదారి పక్కన బస్సు కనిపించింది. దీన్ని గుర్తించిన వారు ఇక్కడి డ్రైవర్లకు సమాచారం అందించారు. ఈ మేరకు బాచుపల్లికి వెళ్లి బస్సును మెదక్‌కు తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని