logo

Andhra News: రూ.44 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపిక

పలాసకు చెందిన కె.స్నేహకిరణ్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతుండగానే భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. రూ.44 లక్షల వేతనంతో అమెజాన్‌కు ఎంపికైనట్లు మంగళవారం సంబంధిత సంస్థ నుంచి వర్తమానం

Updated : 23 Mar 2022 08:53 IST

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: పలాసకు చెందిన కె.స్నేహకిరణ్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతుండగానే భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. రూ.44 లక్షల వేతనంతో అమెజాన్‌కు ఎంపికైనట్లు మంగళవారం సంబంధిత సంస్థ నుంచి వర్తమానం అందింది. స్నేహ ప్రస్తుతం విశాఖపట్నంలోని ప్రైవేట్‌ కళాశాలలో సీఎస్‌ఈ చదువుతున్నారు. తండ్రి సింహాచలం స్థానికంగా జీడిపప్పు ఉత్పత్తి కర్మాగారంలో పనిచేస్తుండగా, తల్లి సుభాషిణి గృహిణి. ప్రాథమిక విద్య నుంచి గణితంపై పట్టు సాధించానని స్నేహకిరణ్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా కోడింగ్‌ విధానం నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి సొంతంగా బృంద చర్చలు నిర్వహించేవారమని చెప్పారు. ఇవన్నీ ఉద్యోగ ఎంపిక సందర్భంగా నిర్వహించిన మౌఖిక పరీక్షల్లో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని