icon icon icon
icon icon icon

ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడికి ‘సన్‌’ స్ట్రోక్‌

ఉపముఖ్యమంత్రి, అనకాపల్లి పార్లమెంటు వైకాపా అభ్యర్థి బూడి ముత్యాలనాయుడికి ఆయన కుమారుడు తలనొప్పిగా మారారు.

Published : 25 Apr 2024 08:02 IST

మాడుగుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు

మాడుగుల, న్యూస్‌టుడే: ఉపముఖ్యమంత్రి, అనకాపల్లి పార్లమెంటు వైకాపా అభ్యర్థి బూడి ముత్యాలనాయుడికి ఆయన కుమారుడు తలనొప్పిగా మారారు. మాడుగుల అసెంబ్లీ వైకాపా అభ్యర్థినిగా ముత్యాలనాయుడు రెండో భార్య కుమార్తె ఈర్లె అనూరాధ పేరును ప్రకటించినప్పటినుంచి మొదటి భార్య కుమారుడు రవికుమార్‌ నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మాడుగుల అసెంబ్లీ స్థానానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మాడుగుల అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. వైకాపా నాయకుల అడుగులకు మడుగులొత్తే రెవెన్యూ అధికారులపై న్యాయపోరాటం చేస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img