icon icon icon
icon icon icon

పాటల్లోనూ సవాళ్లు, ప్రతిసవాళ్లూ.. అధికార పార్టీని ఎండగడుతున్న ప్రతిపక్షాలు

‘జూలు విప్పి దూకిండు ఎల్లో సింగమూ.. దడుసుకుని ఉరుకుతది రౌడీ సంఘమూ’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబుపై ఇటీవల విడుదలైన పాట.. ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపింది.

Published : 04 May 2024 05:49 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘జూలు విప్పి దూకిండు ఎల్లో సింగమూ.. దడుసుకుని ఉరుకుతది రౌడీ సంఘమూ’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబుపై ఇటీవల విడుదలైన పాట.. ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపింది. తెదేపా నిర్వహించే సభలు, సమావేశాల్లో ప్రదర్శిస్తున్న ఈ గానం.. గ్రామాల్లోనూ ప్రతీ ఒక్కరి నోటివెంట వినపడుతోంది. ఉరూరా తిరిగే తెదేపా ప్రచార వాహనాల్లోనూ మార్మోగుతోంది. పాట విడుదలైన మూడు నెలల్లోనే 30లక్షలకు పైగా వీక్షణలు లభించడం విశేషం. గత అయిదేళ్లలో సీఎం జగన్‌ పాలనలో జరిగిన దాడులు, విధ్వంసాలు, అభివృద్ధిలో వెనుకబాటు గురించి ప్రతిపక్షాలు ప్రశ్నించుకుంటూ పాటలు రూపొందిస్తే.. అధికార పార్టీ మరో అవకాశం అంటూ ముందుకు వెళ్తోంది. పార్టీ అధినేతలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా తాము చేసిన పనులు.. చేయబోయే వాటిని పాటల రూపంలో ప్రజలకు చేరవేస్తూ తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘మేమంతా సిద్ధం.. జగన్‌కు ఓటు వేయం’ అని తెదేపా నాయకులు రూపొందించిన పాటలో గత ప్రభుత్వం చేసినా.. ఈ సర్కారు చేయని పనులను వివరించారు. ‘జెండలు జతకట్టడమే మీ ఎంజెండా..’ అంటూ సీఎంపై రాసిన పాటకు సమాధానంగా.. ‘పరదాలు కట్టడమే నీ ఎజెండా.. నీ పాలన పూడ్చిపెట్టడమే ప్రజల ఎజెండా..’ అంటూ తెదేపా నాయకులు  వైకాపా పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. ‘సిద్ధం అన్నోడితో యుద్ధం చేద్దామురా.. కుట్రలు ఆపాలిరా, కూటమి గెలవాలిరా’ అంటూ జనసేన రూపొందించిన పాటలో.. ఆంధ్రావని మనుగడకే తెదేపా, భాజపాతో పొత్తుపెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ‘హల్లో ఏపీ బైబై వైసీపీ’ అంటూ జనసేన రూపొందించిన మరోపాట.. రాష్ట్రంలోని దారుణ పరిస్థితులను ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించిందని పలువురు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img