icon icon icon
icon icon icon

ఎన్నికల తర్వాత ఒక్కొక్క నా కొ.. కథ చెబుతా: రోడ్‌షోలో వైకాపా అభ్యర్థి బెదిరింపులు

ఎన్నికల్లో అడ్డుపడితే.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక్కొక్క నా కొ... కథ చెబుతానంటూ ఉరవకొండ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగా బెదిరింపులకు దిగారు.

Updated : 04 May 2024 09:20 IST

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఎన్నికల్లో అడ్డుపడితే.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక్కొక్క నా కొ... కథ చెబుతానంటూ ఉరవకొండ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగా బెదిరింపులకు దిగారు. అనంతపురం జిల్లా ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ సొంత గ్రామ పంచాయతీ కౌకుంట్ల పరిధిలోని మైలారంపల్లి గ్రామంలో ఈ నెల 2న ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘మేం మంచే చెబుతాం. మంచే మాట్లాడతాం. మీరు మూర్ఖులు, దెయ్యాలు. ఇన్ని సంవత్సరాలు మీకే ఓట్లు వేశారు. కనీసం రోడ్లు వేశారా? ఇళ్లు కట్టించారా? ఏమి చేశారు?’ అంటూ తెదేపా నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ గ్రామంలో అత్యధిక ఓటర్లు తెదేపా సానుభూతిపరులు. ప్రచార సమయంలో ఆయన వెంట వచ్చినవారు, పోలీసులు తప్ప జనం కనిపించలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన విశ్వేశ్వరరెడ్డి.. అందరూ వైకాపాకు ఓట్లు వేయాలని, లేకపోతే అంతు చూస్తామన్నట్లు బెదిరింపులకు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img