icon icon icon
icon icon icon

ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరుడి ఇటుకల బట్టీ వద్ద మద్యం డంప్‌

తిరుపతి జిల్లా పాకాల మండలంలో పెద్దఎత్తున మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 04 May 2024 09:27 IST

పాకాల, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా పాకాల మండలంలో పెద్దఎత్తున మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంటపల్లి నుంచి యల్లంపల్లి వెళ్లే మార్గంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్య అనుచరుడికి చెందినదిగా భావిస్తున్న ఇటుకల బట్టీ వద్ద మద్యాన్ని గుర్తించి పోలీసులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఐషర్‌ మినీ లారీలో మద్యం ఉండగా విశ్వసనీయ సమాచారంతో అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 200-300 వరకు మద్యం కేసులున్నట్లు భావిస్తున్నారు. ఇటుక బట్టీల పక్కనే ఉన్న షెడ్‌లోనూ పెద్దఎత్తున మద్యాన్ని గుర్తించినట్లు తెలిసింది. స్థానిక పోలీసులు ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img