icon icon icon
icon icon icon

అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే

శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్‌ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు.

Published : 17 May 2024 04:05 IST

మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ధ్వజం

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్‌ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నోటీసు ఇచ్చి మౌఖికంగా నా వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సమంజసం? ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించారు. బలహీనవర్గాలను జగన్‌ చిన్నచూపు చూస్తున్నారనేదానికి ఇదే నిదర్శనం. జగన్‌ చెప్పే దానికి.. చేసే దానికి పొంతనే ఉండదు. ఓటింగ్‌ సరళిని గమనిస్తే తెదేపా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరం’ అని జంగా కృష్ణమూర్తి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img