icon icon icon
icon icon icon

తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు

పోలింగ్‌ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు.

Published : 17 May 2024 04:06 IST

14 రోజులు రిమాండు విధించిన న్యాయస్థానం

ఉరవకొండ, విడపనకల్లు, న్యూస్‌టుడే: పోలింగ్‌ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. ఈనెల 14న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి తెదేపా బీసీ నాయకుడు సూర్యముని ఇంటికి వెళ్లి ఆయన్ను దూషిస్తూ, దాడి చేశారు. ఈ ఘటనలో సూర్యముని అనుచరుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. సూర్యముని ఇంటికి వెళ్లి పరామర్శించారు. తర్వాత అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. తాడిపత్రి సీఐ మురళీకృష్ణతో పాటు కొందరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనలపై సీఐ ఫిర్యాదుతో 91 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఏ2గా తెదేపా నాయకుడు సూర్యమునిని చేర్చారు. దీంతో తెదేపాకు చెందిన 53 మందిని, వైకాపాకు చెందిన 38 మందిని గురువారం అరెస్టు చేసి ఉరవకొండ ఫస్ట్‌క్లాస్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు. రిమాండ్‌ కింద నిందితులను రెడ్డిపల్లి జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img