icon icon icon
icon icon icon

ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు

గతంలో ఎన్నడూ లేనంతగా   81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Published : 17 May 2024 04:12 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గతంలో ఎన్నడూ లేనంతగా   81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తమపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ‘పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించగానే మీ కుటుంబ సభ్యునిగా భావించి స్వచ్ఛందంగా పనిచేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. రాత్రి పది గంటల వరకు నిల్చుని ఓటేయడం మీ ప్రేమను తెలియజేసింది. పిఠాపురంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జనసైనికులు, తెదేపా, భాజపా కార్యకర్తలు వ్యవహరించిన తీరు అభినందనీయం. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అధికారులు చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా’ అని పవన్‌కల్యాణ్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వర్మకు హృదయపూర్వక ధన్యవాదాలు

పిఠాపురం నుంచి పోటీ చేస్తాననగానే తన సీటు త్యాగం చేసి, సంపూర్ణ మద్దతు ప్రకటించిన నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి వర్మ, వారి కార్యకర్తలకు పవన్‌కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో పోటీచేస్తున్నానని తెలియగానే తమ సినీ కుటుంబ సభ్యునికి అండగా ఉండేందుకు తమ చిత్రాల షెడ్యూల్‌లను వదులుకుని పిఠాపురంలో ప్రచారం చేసిన నటీనటుల ప్రేమ తనను కదిలించిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img