icon icon icon
icon icon icon

పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు

ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్‌, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 17 May 2024 04:09 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్‌, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం పెనమలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్‌, ఆయన అనుచరులపైనా కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13న పోరంకిలో దొంగ ఓట్లు వేస్తున్నారన్న విషయంపై వైకాపా, తెదేపా వర్గీయులు పోరంకి- నిడమానూరు రహదారిపై ఘర్షణకు దిగారు. అదే రోజు సాయంత్రం బోడే ప్రసాద్‌, మరికొందరు అనుచరులతో కలిసి జడ్పీ ఉన్నత పాఠశాలలోకి చొరబడి ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించారని వీఆర్వో అబ్దుల్‌ అలామ్‌ పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్‌, ఆయన సోదరుడు బోడే సురేష్‌, అనుచరులు అన్నే చంటి, పవన్‌, భార్గవ్‌, వీరూ యాదవ్‌, మరికొందరిపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img