icon icon icon
icon icon icon

వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం

ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్‌ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 17 May 2024 04:38 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్‌ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా వాళ్లు ఇచ్చిన నగదును నిరాకరించి.. తెదేపాకు ఓటు వేశారన్న కారణంతో ఓ కుటుంబంపై దాడిచేయడం దారుణమని వాపోయారు. ఆడవాళ్లని కూడా చూడకుండా పాశవికంగా దాడికి పాల్పడటంపై ఎక్స్‌ వేదికగా గురువారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. వైకాపా రౌడీలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి గూండాలను అరెస్టు చేయాలి. మాచర్లలో మారణహోమానికి కారణమైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తే తప్ప దాడులు ఆగవు. విజయవాడ భవానీపురంలో పోలింగ్‌రోజు జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా నేత స్టేషన్‌ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల బాధ్యులపై కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టాలి. తప్పుచేసిన పోలీసులను బదిలీ చేయాలి. వారిపైనా కేసులు పెట్టాలి’’ అని చంద్రబాబు డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img