icon icon icon
icon icon icon

దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?

పోలింగ్‌ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 17 May 2024 04:38 IST

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కూలీల్లా మార్చారు
సర్వేపల్లిలో వైకాపా గూండాల దాడుల్ని అడ్డుకోని పోలీసులు
తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోలింగ్‌ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి వక్రీకరణలు తగవని హెచ్చరించారు. జన్మనిచ్చిన తల్లి, తోడబుట్టిన చెల్లే కాదు.. కడప ప్రజలు కూడా జగన్‌ను తిరస్కరించారని విరుచుకుపడ్డారు. వైకాపా ప్రభుత్వంలో దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల్ని అధికార పార్టీ చెప్పినట్లు చేసే కూలీల్లా మార్చారని విమర్శించారు. శాసనసభలో తీసుకున్న నిర్ణయాల్ని చెత్తబుట్టలో పడేశారని దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని.. తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదిలే ప్రశ్నే లేదని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘బయట ప్రాంతాల నుంచి గూండాల్ని తీసుకొచ్చి సర్వేపల్లిలో తెదేపా కార్యకర్తలపై దాడులు చేయించారు. అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. పోలింగ్‌ సరళిని, ఓటేయడానికి పోటెత్తిన ప్రజల్ని చూసి వైకాపా వాళ్లకు ఓటమి భయం పట్టుకొంది. ఆ ఒత్తిడిలో దాడులు, దుర్మార్గాలకు పాల్పడ్డారు. వైకాపా నేతలందరికీ ప్రజలు   బుద్ధి చెబుతారు’ అని చంద్రమోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img